Top 5 Telugu Movies – 2013.

దాదాపు అన్నిపెద్ద సినిమాలకీ Box-Office దగ్గర భారీ కలెక్షన్స్ వచ్చినా ఈ 2013 మాత్రం చిన్న  సినిమాలదే అని చెప్పొచ్చు.Action,Formula సినిమాల కంటే కూడా ఏదొక రూపంలో కొత్తదనం  చూపించిన  సినిమాలే ఎక్కువ సంఖ్యలో విజయవంతం అయ్యాయి.భారీ విజయాలు చూసిన పెద్ద సినిమాలలో కూడా  Family Emotions ప్రధానంగా ఉండడం గమనించాల్సిన విషయం.Commercialga కూడా అన్నీసక్సెస్  అయినవే అయినా Box-Office numbersకీ ఈ list సంబంధం లేదు.మూస పద్దతిలో కాకుండా ఏ మేరకు  కొత్తగా try చేసారు అనే దాని ఆధారంగానే ఈ List ని sort out చేయడం జరిగింది.

5.స్వామిరారా (Swamy Ra Ra)

Image

మన దగ్గర క్రైమ్ కామెడీ రావడం చాలా తక్కువ.ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణ..క్షణం, మనీ ,అనగనగా ఒక రోజు తర్వాత కొంత వరకు చంద్రశేఖర్ యేలేటి ‘ఐతే’ తప్ప ఆ Genre ని మన వాళ్ళు  పెద్దగా touch చేయలేదు.ఇన్నాళ్ళకి  సుధీర్ వర్మ ‘ స్వామిరారా ‘ తో అలాంటి సినిమా తీసారు.ఇలాంటి సినిమాలకి Most Important అయిన పక్కా script,Tight Screenplay తో పాటూ Technical గా కూడా చాలా పకడ్బందీగా ఉండేట్లు చూసుకున్నారు.Content తో పాటూ Taking పరంగా కూడా చాలా కొత్తగా ఉండడం ఈ సినిమాకి పెద్ద plus point.Interval block గా వచ్చే 5 Lakhs 5 Crore idea మాత్రం Master Stroke.ఇలాంటి వాటికి Effective BGM,మంచి Music,Cinematography,Neat Casting తోడవడంతో Final గా మంచి  output వచ్చింది.Box-Office పరంగా wide range సూపర్ హిట్ కాకపోయినా ఆ budget కి commercial గా చాలా బాగా Pay చేసినట్టే లెక్క.పూర్తి freshnessతో  ఉండే ఈ  ‘ స్వామిరారా’ Comfortable గా Top 5 lo నిలబడింది.

4. మిర్చి (Mirchi) 

Image

ప్రభాస్ కి సరిపోయే టైటిల్,మంచి ఆడియో,Interesting Casting choice లాంటివి ఈ సినిమా మీద రిలీజ్ కి ముందే positive vibrations create చేసినా,కొత్త
Director,Prducers కాబట్టి Output ఎలా  ఉంటుందో,పైగా February లాంటి unseason లో వస్తుంది.ప్రభాస్ కి ఈ సారైనా Solid Hit వస్తుందో,రాదో అనే అనుమానంతో ఉన్నఅందరికీ ‘ మిర్చి ‘ పెద్ద షాకే ఇచ్చింది.కథ పరంగా చెప్పుకుంటే పక్కా మాస్ సినిమాలాగానే అనిపిస్తుంది కానీ screen మీద దానికి family emotions ని కలిపి క్లాస్ టచ్ తో కొత్తగా present చేసారు.డార్లింగ్,Mr.పర్ఫెక్ట్ లో ఉండే soft character కి వర్షం,ఛత్రపతి లాంటి  సినిమాల్లో ఉండే షేడ్స్ ని కలిపి ప్రభాస్ ని Perfect గా వాడుకోవడం ఈ సినిమాకి Main హైలైట్. ప్రభాస్  Ferociousga కత్తి పట్టుకుని పంచె కట్టేప్పుడు whistles వేసాం,అలానే controlled emotions తో  డైలాగ్స్ చెప్తున్నప్పుదూ Enjoy చేసాం.Onscreen ప్రభాస్ one man show అని చెప్పొచ్చు. అలాంటి  Commercial story ని  over the top కాకుండా ఇప్పటి trend కి తగ్గట్టు Subtle గా  deal చేస్తూ  Family emotions ని కుడా రాబట్టిన Writer/Director కొరటాల శివ  ‘ మిర్చి ‘ కి  Offscreen హీరో. Box-Office పరంగా కుడా భారీ విజయాన్నిచూసిన ‘ మిర్చి ‘ మన Best List lo No.4.
3.గుండె జారి గల్లంతయ్యిందే ( Gunde Jaari Gallanthayyinde)
Image
This years Surprise Blockbuster.రొమాంటిక్ కామెడీ అనేవి మన దగ్గిర చాలా తక్కువ.’అలా..మొదలైంది’,’ఇష్క్’ లాంటివి ఒకటీ అరా వచ్చినా,అవి A Centers మహా ఐతే కొన్ని B Centers వరకు మాత్రమే పరిమితం అయిపోయేవి.కాని ఇది మాత్రం అన్ని centers audienceకీ కనెక్ట్ అవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేసింది.Script,Content బాగుంటే చిన్న,పెద్ద అనే తేడా రిలీజ్ లోనే కానీ రన్నింగ్ లో కాదు అనే విషయాన్ని Prove చేసిన సినిమా ఇది.Confusion తో కామెడీ రాబట్టటం అనే కాన్సెప్ట్ తో చాలానే వచ్చినా అవి out n out కామెడీ సినిమాలుగానే ఉంటాయ్.ఒక లవ్ స్టొరీ కి అలాంటి కామెడీని జత చేసి ఇలా డీల్ చేయడం అనేది మన  దగ్గిర దాదాపు లేదనే చెప్పొచ్చు.తనకి బాగా సరిపోయే characterలో నితిన్,ఇలాంటి charactersని  బాగా చేసేయగల నిత్య,అనూప్ Songs,విజయకుమార్ Story / Direction, Harshavardhan పక్కా Screenplay / Dilogues,Comedy…ఇవన్నీకలిపి “గుండె జారి గల్లంతయ్యిందే” ని No 3 lo ఉండేలా చేసాయ్.
2. అత్తారింటికి దారేది (Attarintiki Daredi) 
Image
ఈ సంవత్సరంలో వచ్చిన Most Popular Film.ఒక సినిమాకి ఎన్నిసమస్యలు ఉంటాయో అన్నింటినీ   Face చేసిన సినిమా ఇదే అయ్యుంటుంది.అసలు సినిమా రిలీజ్ అవడమే గొప్ప అనుకుంటే,రిలీజ్  అయ్యి ఏకంగా Industry Hit అవడం అంటే,అధ్బుతం కూడా అబ్బుర పడే విజయం ఇది.రిలీజ్ కి   ముందే దాదాపుగా చచ్చిపోయిన సినిమా Theatres వరకు రావడానికి ‘Pawan Kalyan’ అనే పేరు  ఉపయోగపడితే,కలెక్షన్స్ లో అది ‘మగధీర’ లాంటి ఎవరెస్ట్ ని దాటి Industry Hit గా నిలబడటానికి  హీరో ఇమేజ్ తో పాటు అందులో ఉన్న content కూడా ప్రధాన కారణం అయ్యింది.ఒక స్టార్ హీరో ని  పెట్టుకుని Lady Character (అత్త) చుట్టూ కథని అల్లుకోవడమే ఇప్పట్లో ఒక సాహసం అయితే,మాస్ అంశాలు కూడా అంతగా లేని ఒక Soft Family సినిమా  Industry Hit అవుతుందని ఎవరూ ఊహించుండరు.అలాంటిది A to Z అన్ని సెంటర్స్ లో  దుమ్ము దులిపిందంటే అది కేవలం  పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ ,దేవి శ్రీ ప్రసాద్  కలిసి చేసిన మేజిక్.Pre-Release పైరసీ నుండి Industry Hit వైపుకి  దారి  చూపించిన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల ” అత్తారింటికి దారేది ” మన Best of 2013 lo No.2.
Finally,Here comes The BEST Telugu Film in 2013.
1.సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) 
Image
సినిమా  వెరీ బిగినింగ్ లో  ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది – ఆయన తెలవారుతుండగా పొలం  నుండి నడుచుకుంటూ వస్తుంటారు.దారిలో తనకి తెలిసిన వాళ్ళని,తనని పలకరించే వాళ్ళని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వెళ్తుంటారు. తనని చూసి కూడా మొహం పక్కకి తిప్పుకుని వెళ్ళే వాళ్ళని కూడా ఆయనే పిలిచి అదే చిరునవ్వుతో పలకరిస్తారు.ఆ దారిలో తను చేయగల సాయం చేస్తూ వెళ్ళిపోతుంటారు. – సినిమా లో ఏమి చెప్పాలనుకున్నారో ఇక్కడే అర్ధం అవుతుంది మనకి – ఆనందం అంటే  జీవితంలో ఎదురైన అందరితో అనవసరమైన పట్టింపులకి తావివ్వకుండా నవ్వుతూ చేయగల సాయం చేస్తూ వెళ్ళిపోడమే అని.’సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ ద్వారా శ్రీకాంత్ అడ్డాల చెప్పాలనుకుంది కూడా ఇదే.
వెంకటేష్-మహేష్ అన్నదమ్ములుగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ గా ‘దిల్’ రాజు ఈ సినిమాని మొదలు పెడుతున్నారు అని ప్రకటన వచ్చిన వెంటనే ఈ సినిమా ‘Most Anticipated Film Of The Year’ అయిపొయింది.అంత హైప్ మధ్య వచ్చిన ఈ సినిమాకి 1st Day వచ్చిన టాక్ చూసి Avg-Abv Avg అవుతుందని అనుకున్నారు.కాని,3rd Day నుండి కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో బలపడి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏ అయినా కమర్షియల్ సినిమాల్లో ఉండే ఎక్కువ మెలోడ్రామా లేకుండా ఉండడం,అంత పెద్ద స్టార్స్ ని పెట్టుకుని కూడా ఎక్కడా  Cinematic Liberties తీసుకోకుండా కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే సంబంధాలని,భావోద్వేగాల్ని వాస్తవానికి దగ్గిరగా చూపించడం….లాంటివి ఈ సినిమాని ‘Simple but Beautiful’ అనిపించేలా చేసాయి.
కెరీర్ పీక్ లో ఉన్నఈ టైంలో హీరోయిజం,ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకోకుండా సగటు మధ్య తరగతి కుటుంబంలోని చిన్నకొడుకులా మహేష్,తనకి ఉన్న ‘Super Good Family Man’ లాంటి ఇమేజ్ ని  పక్కనపెట్టి  ‘మంచోడే  కాని  కాస్త  మొండోదు’ అనిపించే పెద్ద కొడుకుగా వెంకటేష్…ఇద్దరూ అన్నదమ్ములుగా వీళ్ళిద్దరి మధ్య ఉండే సన్నివేశాలను బాగా పండించారు.ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అనవసరపు హంగులకి పోకుండా తను చెప్పాలనుకున్న దానిని ఎక్కడా పక్కకి పోనివ్వకుండా కుటుంబ సంబంధాలు ఇలానే ఉంటాయి అన్నంత సహజంగా చూపిస్తూ చివరి వరకూ అందంగా నడిపారు.ఇలా ఏది చూసుకున్నా ఇప్పటి కమర్షియల్ సినిమాలకి సంబంధించిన ఏ ఒక్క ఫార్ములానీ ఫాలో అవకుండా చాలా  నిజాయితీతో తీసిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.అందుకే ఇది Best 0f 2013 లో టాప్ 1.
 
SVSC కంటే చాలా పెద్ద హిట్ అయిన AD 2nd ఉండడం ఏంటి ?? అంటే  – Commercial elements.Regular commercial సినిమాలతో పోలిస్తే ADలో కూడా ఇవి చాలా తక్కువే  అయినప్పటికీ,SVSCలో అసలు వాటి జోలికే పోలేదు అన్నది గమనించాలి.
ఇవే కాక ఇంకొన్నిచిన్నసినిమాలు కూడా content పరంగా కొత్తగా try చేసి  మెప్పించడమే కాకుండా  commercial గా కూడా పెద్ద విజయం సాధించాయి.ఆ list లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ప్రేమ కథా చిత్రం ,ఉయ్యాల జంపాల లాంటివి ముందు ఉంటాయి.రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్నాEntertain చేసిన list లో  బాద్షా ,నాయక్,బలుపు ఉంటాయి.2013 లో కమర్షియల్ ఫార్ములా ని నమ్మి తీసినవాటి కంటే Concept wise కొత్తగా వెళ్ళిన వాటికే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడం అనేది ప్రొడ్యూసర్స్ కి మాత్రమె కాకుండా Audience కి కూడా మంచి పరిణామం !! 

 

Advertisements

14 responses to “Top 5 Telugu Movies – 2013.

  1. PKC lo aa saptagiri comedy superb, but overall movie ga choosukunte anta kottadanam emi ledu but entertain chesindhi ,uyyala jampala rakapoi unte naa top 5 lo undedhi PKC 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s